IAS Transfers | తెలంగాణలో పలు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ నియామకమయ్యారు. ఎన్వీఎస్రెడ్డిని హెచ్ఆర్ఎం ఎండీ బాధ్యతలు అప్పగించింది. మహిళౄ, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌గా శృతి ఓజా బదిలీ చేసింది. ఎస్సీ గురుకులాల కార్యదర్శిగా కృష్ణ ఆదిత్యకు అదనపు బాధ్యతలు అప్పగించింది. హెచ్ఎండీఏ కార్యదర్శిగా కోట శ్రీనివాత్సవకు అదనపు బాధ్యతలు ఇచ్చింది ప్రభుత్వం. హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్లుగా ఆర్ ఉపేందర్‌రెడ్డి, టీ వెంకన్న, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారిగా ఎం రాజిరెడ్డి, ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్‌గా రాజేశ్వర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. ప్రభుత్వ పట్టణ రవాణా సలహాదారుగా ఎన్వీఎస్రెడ్డి నియాకమయ్యారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.