తొలిచూపులోనే ప్రేమ !! బస్టాప్‌లో కనిపించిన ఓ యువతిని చూడగానే ప్రేమలో పడిపోయాడు ! పెండ్లి అంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలని అనుకున్నాడు. ముందుగా ఆ అమ్మాయి మనసు గెలుచుకునేందుకు ఆమె వెంటపడ్డాడు. కొద్దిరోజులకు ఆ అమ్మాయి కూడా అతనికి పడిపోయింది. ఇద్దరూ కొద్దిరోజులు చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగారు. ఇక పెండ్లి చేసుకుందామని ఫిక్సయి తల్లిదండ్రులకు చెప్పారు. పిల్లలను ప్రేమను అర్థం చేసుకున్న వాళ్లు కూడా.. కులాలు వేరైనా పెండ్లికి ఓకే చెప్పారు. ఈ కథ అంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా ! ఎందుకంటే ఇప్పుడు ఈ లవ్ స్టోరీ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అందుకు కారణం ఆ యువకుడు ఓ ఐఏఎస్ అధికారి. పేరు రాహుల్. ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా పనిచేస్తున్నాడు. నారాయణపేటకు చెందిన ఐఏఎస్ అధికారి రాహుల్ ప్రేమించిన అమ్మాయి మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన మనీషా. పెద్దలు ఒప్పుకోవడంతో.. ప్రేమికుల దినోత్సవానికి నాలుగు రోజుల ముందు.. అంటే ఫిబ్రవరి 10న పెండ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఈ క్రమంలో ఆయన రూపొందించిన పెండ్లి ఇన్విటేషన్ వీడియో వైరల్‌గా మారింది. అందులో బస్టాప్‌లో తను ప్రేమించి అమ్మాయిని చూసింది మొదలు.. ఆమెకు ప్రపోజ్ చేసింది.. పెద్దలకు తమ లవ్ గురించి చెప్పి ఒప్పించింది.. ఇలా మొత్తం తమ లవ్ జర్నీని ఆ వీడియోలో చూపించారు. ఆ వీడియోను ఒకసారి మీరు చూసేయండి..