వరంగల్‌చౌరస్తా, డిసెంబర్ 4 : తెలంగాణలో వైద్య విద్య వనరులు మెరుగుపరచడం, విద్యార్థుల్లో నమ్మకం, భరోసా కల్పించడం కోసం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ఇన్చార్జి బాధ్యతలను ఐఏఎస్ అధికారికి అప్పగించడానికి ప్రభుత్వం పలువురు పేర్లను పరిశీలిస్తున్నది. అందులో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ పేరు ముందువరుసలో ఉన్నట్టు తెలుస్తున్నది. తుది నిర్ణయం ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్నట్టు వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మా రాయి. వీసీ నందకుమార్‌రెడ్డి రాజీనామా చేయడంతో ఆ పోస్టు ఖాళీగా ఉన్నది.
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పీజీ పరీక్షల వాల్యువేషన్లో అక్రమాలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం ఆరా తీస్తున్నది. హెల్త్ యూనివర్సిటీ ప్రతిష్ఠను కాపాడుకోవడం కోసం ఇన్చార్జి వీసీ బా ధ్యతలను ఐఏఎస్ అధికారికి అప్పగించి పాలనతోపాటుగా యూనివర్సిటీ పరువు నిలబెట్టడానికి ప్రభుత్వం అష్టకష్టాలు పడుతున్నది.