సుల్తాన్‌బజార్, జూన్ 17: తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కార్యదర్శిగా ఐఏఎస్ కాంతివెస్లీ మంగళవారం బాధ్యతలను స్వీకరించారు. హెచ్ఆర్సీ కార్యదర్శిగా విధులు నిర్వహించిన కే నిఖిల ఇతర శాఖకు బదిలీ కావడంతో ఆమె స్థానంలో పూర్తిస్థాయి అడిషనల్ చార్జ్ బాధ్యతలు స్వీకరించారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కాంతివెస్లీని అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.