కామారెడ్డి, అక్టోబర్ 24: ‘కేసీఆర్ గెలిచేదాకా నాకు సావు లేదు. ఆయనకు ఓటెయ్యాలె. ఆయన గెలుపును కండ్లారా సూడాలె. చెవుల నిండా వినాలె. కేసీఆర్ గెలుపుతోనే దేవుని రాజ్యం వస్తది’ అని ఓ వృద్ధురాలు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ మీద అభిమానంతో ఈ అవ్వ మాట్లాడిన మాటలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. బీఆర్ఎస్ నాయకుడు గంప శశాంక్ కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం బస్వాపూర్‌లో ఇటీవల ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లగా, 80 ఏండ్ల దీవెనమ్మ తారసపడింది. ఈ సందర్భంగా శశాంక్ పలుకరించగా.. దీవెనమ్మ కేసీఆర్‌ను గుర్తుచేసుకున్నది. మళ్లా కేసీఆర్ రాజ్యం వచ్చేదాక తాను సచ్చేది లేదని చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అన్నీ బాగుండేవని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక ఏదీ సక్కగలేదని, ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదని దీవెనమ్మ వాపోయింది. ‘పింఛిని పెంచుతమన్నరు. ఇప్పటిదాంక పెంచలే! గంప గోవర్ధన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజల కష్టాలు తెలుసుకునేటోడు. ఇప్పుడెవలూ మమ్ముల పట్టించుకుంటలేరు’ అని ఆవేదన వ్యక్తంచేసింది.