కవాడిగూడ, ఏప్రిల్ 5 : తాను పార్టీ మారడం లేదని, తనపై సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తేల్చిచెప్పారు. శుక్రవారం ముషీరాబాద్‌లోని హెరిటేజ్ ఫంక్షన్ హాల్లో జరిగిన ముషీరాబాద్ బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల తాను బీఆర్ఎస్ని వీడుతున్నట్లు వస్తున్న తప్పుడు ప్రచారాన్ని నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గం ప్రజలు నమ్మొద్దని కోరారు. తనపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు.