హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : ప్రైవేట్ స్కూళ్లపై దౌర్జన్యాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) కోరింది. బుధవారం మల్కాజిగిరి పోలీసు కమిషనర్ సుమతిని కలిసి వినతిపత్రం సమర్పించింది. తాజాగా ఉప్పల్ ప్రాంతంలో కొందరు బెదిరింపులకు దిగగా, కేసులు నమోదు చేసినట్టు సీపీకి వివరించారు.
కొందరు ఆర్టీఐ యాక్టివిస్ట్‌లు, కుల, విద్యార్థి సంఘాల పేరిట స్కూళ్లను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు వినతిపత్రంలో పేర్కొన్నారు. స్పందించిన సీపీ సుమతి వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా డబ్బులు అడిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించినట్టు ట్రస్మా నేతలు వివరించారు.