Google Maps | హైదరాబాద్, మే 25: గూగుల్ మ్యాప్‌ను నమ్ముకున్న కొందరు ప్రయాణికులు కాలువలోకి తమ వాహనాన్ని నడిపి ప్రమాదంలో చిక్కుకున్నారు. ఒక మహిళ సహా హైదరాబాద్‌కు చెందిన నలుగురు టూరిస్టులు ఎస్యూవీ వాహనంలో కేరళలోని అలప్పుజా వైపు వెళ్తుండగా, కురుప్పంతరలో శుక్రవారం రాత్రి వారి కారు నీటి ప్రవాహంతో నిండిన కాలువలోకి దూసుకుపోయింది.
గూగుల్ మ్యాప్ సహాయంతో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే స్థానికులు వారిని రక్షించారు. భారీ వాన కారణంగా వారు ప్రయాణిస్తున్న రోడ్డుపై భారీ యెత్తున నీరు ప్రవహించిందని పోలీసులు తెలిపారు. దాని కారణంగా ఆ కాలువ కూడా నీటిలో కనిపించలేదని, పర్యాటకులకు ఈ ప్రాంతం గురించి తెలియకపోవడం వల్ల వారు గూగుల్ మ్యాప్‌లను ఉపయోగించి నావిగేట్ చేస్తూ నేరుగా నీటితో నిండిన ప్రదేశంలోకి వెళ్లినట్టు పోలీసులు తెలిపారు.