న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఆత్మవిశ్వాసంలో హైదరాబాద్ విద్యార్థులు ముందంజలో ఉన్నారు. ఈ విషయం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఎస్), ఎడ్టెక్ కంపెనీ లీడ్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆత్మవిశ్వాసం ఎలా ఉందనే విషయంపై దేశ నలువైపులా ఆరు మెట్రో నగరాలతోపాటు ప్రధాన నగరాల్లో 2,807 మంది విద్యార్థులను సర్వే చేశాయి.
ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. రాష్ట్ర బోర్డుల పరిధిలో చదివే విద్యార్థుల కంటే సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ విద్యార్థుల్లో కాన్ఫిడెన్స్ కాస్త ఎక్కువగా ఉన్నట్టు తేలింది. అయితే ఢిల్లీలో రాష్ట్ర బోర్డు పరిధిలో చదువుకునే విద్యార్థులే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టు వెల్లడైంది. కాగా, 36 శాతం విద్యార్థుల్లో 80-100 శాతం కాన్ఫిడెన్స్ ఉన్నట్టు తెలిసింది.