హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): పచ్చదనం పెంపుదలే లక్ష్యంగా కొనసాగుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తిని శ్రీలంకలోనూ విస్తరింపజేస్తామని ఆ దేశ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ డీ వెంకటేశ్వరన్ పేర్కొన్నారు. ఇంత అద్భుత కార్యక్రమం నిర్వహిస్తున్న రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ను శ్రీలంకకు ఆహ్వానించి, ప్రధాని మహేంద్రరాజపక్సేతో కలిసి గ్రీన్ చాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. గురువారం ఆయన హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌నగర్ పార్కులో మొక్కలు నాటారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి రాఘవ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ-శ్రీలంక మధ్య టూరిజం సర్క్యూట్
తెలంగాణ-శ్రీలంక మధ్య ఆధ్యాత్మిక, పర్యాటక, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసేలా టూ రిజం సర్క్యూట్‌ను రూపొందించాలని పర్యాటక, సాంస్కృతికశాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. శ్రీలంక డిప్యూటీ హై కమిషనర్ వెంకటేశ్వరన్ గురువారం హైదరాబాద్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, టీఎస్‌టీడీసీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, ఎండీ మనోహర్‌తో సమావేశమై టూరిజం స ర్క్యూట్ గురించి చర్చించారు. శ్రీలంకలో పర్యటించాలని మంత్రిని వెంకటేశ్వరన్ ఆహ్వానించారు.