హైదరాబాద్, ఆట ప్రతినిధి : భారత్ ర్యాలీ డ్రైవర్, హైదరాబాద్‌కు చెందిన పులిగిల్ల నవీన్ ఎఫ్ఐఏ ఆఫ్రికన్ ర్యాలీ చాంపియన్ షిప్ (ఏఆర్సీ) మూడో రౌండ్ అయిన రువాండా మౌంటెన్ గొరిల్లా ర్యాలీలో పోటీకి సిద్ధమయ్యాడు.
తన కో-డ్రైవర్ ముసా షరీఫ్‌తో కలిసి నవీన్ శని, ఆదివారాల్లో రువాండాలోని క్లిష్టమైన పర్వత ప్రాంత రహదారులపై 307.52 కిలోమీటర్ల మేర జరిగే రేసులో పాల్గొంటాడు. డ్యూరాన్ రేసింగ్ తరఫున ఏఆర్సీ3 విభాగంలో ఫోర్డ్ ఫియెస్టా కారుతో బరిలోకి దిగుతున్న నవీన్ టైటిల్‌పై గురి పెట్టాడు.