థెస్సాలాంనికి: గ్రీన్ నుంచి జర్మనీకి శుక్రవారం ప్రయాణిస్తున్న రెయిన్ఎయిర్ విమానంలో క్యాబిన్ కిటికీ ఊడిపోవడంతో ఒక ప్రయాణికుడు దాదాపుగా బయటకు ఎగిరిపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే అతడి సీట్ బెల్ట్ ఊడిపోకుండా ఉండటం, తోటి ప్రయాణికులు అతడిని తిరిగి విమానంలోకి లాగడంతో ప్రమాదం తప్పింది. బాధితుడిని సెర్బియా పర్యాటకుడిగా గుర్తించారు. థెస్సాలాంనికి నుంచి మెమ్మిన్జెన్కు విమానం ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ ఘటన కారణంగా విమానం థెస్సాలాంనికి వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది.