శేరిలింగంపల్లి మే 10: మిస్ వరల్డ్ పోటీలను నిరసిస్తూ గచ్చిబౌలి స్టేడియం వద్ద ప్రగతిశీల మహిళా సంఘంతోపాటు ఇతర మహిళా సంఘాల కార్యకర్తలు శనివారం నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మిస్‌వరల్డ్ పోటీలను వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాల కార్యకర్తలు స్టేడియంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, మహిళా సంఘాల కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
అనంతరం సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. పరిస్థితిని గమనించిన పోలీసులు ఆందోళనకారులు, మహిళా సంఘాల కార్యకర్తలను మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా డెమోక్రటిక్ యూత్ ఆర్గనైజేషన్ (ఏఐడీవైవో), ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ (పీడీఎస్‌యూ), ఆలిండియా మహిళా సాంస్కిట్రిక్ సంఘటన్ (ఏఐఎంఎస్ఎస్), ఆలిండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (ఏఐడీఎస్వో), పీడీఎస్‌యూ నాయకురాళ్లు వడ్ల జయ, రాణి, వీ సంధ్య, ఝాన్సీ, అనురాధ, అరుణ, మహేశ్, నాగరాజు, రవి, జయసుధ, సింహాద్రి, సావిత్రి, శ్రీదేవి, తిరుమల సవిత పాల్గొన్నారు.