హైదరాబాద్, మే 29: టాలెంట్ హబ్‌గా హైదరాబాద్ మారుతున్నదని కేపీఎంజీ తాజాగా వెల్లడించింది. హైదరాబాద్‌తోపాటు నవీ ముంబై, పుణెలలో ప్రతిభ కలిగిన టెక్నాలజీ నిపుణులకు అధిక డిమాండ్ ఉన్నదని బుధవారం ‘టాలెంట్ ఫిజబిలిటీ రిపోర్ట్‌లో పేర్కొంది. జీవన ప్రమాణాల్లో ఈమూడు నగరాలు మొదటి స్థానాల్లో నిలిచాయని తన నివేదికలో వెల్లడించింది. జీవన నాణ్యత, కనెక్టివిటీ, ప్రయాణ సమయం, భద్రత, ఆరోగ్య సంరక్షణ, గాలి నాణ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని కేపీఎంజీ ఈ నివేదికను రూపొందించింది. కానీ, ఇదే సమయంలో అద్దె, మొత్తం ఖర్చులపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేశారని తెలిపింది.