శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 24: వస్తు సరఫరా, పంపిణీలో రవాణా అత్యంత కీలకమని, ఈ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. శనివారం శంషాబాద్‌లో జరిగిన హైదరాబాద్ గూడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్ స్వర్ణోత్సవాలకు ఆయన విచ్చేసి మాట్లాడారు. రవాణా రంగం దేశ ప్రగతికి దిక్సూచి అని పేర్కొన్నారు. అనంతరం అసోసియేషన్ నూతన లోగోను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంజయ్‌కుమార్, హైదరాబాద్ గూడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్ ప్రతినిధులు అంజనీకుమార్ అగర్వాల్, నరేష్గుప్త, రామ్‌కుమార్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.