హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): యూఎస్ఏ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(టీడీఎఫ్) ఆధ్వర్యంలో ఎంవీ రమణారెడ్డి జీవిత విశేషాలపై కోలీ ముఖర్జీ ఘోష్ రచించిన ‘ఎంవీ రమణారెడ్డి, పాత్ టూ ఆర్టిస్టిక్ బ్రిలియన్స్-ఏ జర్నీ’ (కళాత్మక ప్రతిభకు మార్గం- ఒక ప్రయాణం) పుస్తకాన్ని సోమవారం అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఆవిష్కరించారు. రమణారెడ్డి స్మారక శిల్పాల రూపకల్పనకు సుపరిచితుడు.
ప్రపంచంలోనే అతిపెద్ద అతుకులు లేని (సీమ్ లెస్) స్టెయిన్లెస్ స్టీల్ నిర్మాణాల్లో ఒకటైన అమరవీరుల స్మారకానికి ఎంవీరెడ్డి రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమంలో యూఎస్ఏ టీడీఎఫ్ అధ్యక్షుడు డాక్టర్ దివేశ్ అనిరెడ్డి, చైర్మన్ వెంకట్ మారెమ్, మాజీ అధ్యక్షురాలు కవిత చల్లా, టీడీఎఫ్ న్యూజెర్సీకి చెందిన మురళి చింతలపాణి పాల్గొన్నారు.