ఐఐటీహెచ్‌లో హైబ్రిడ్ ఎఫ్ఆర్పీ అభివృద్ధి
సంగారెడ్డి కలెక్టరేట్, మే 7: పాత భవనాలు, బ్రిడ్జిల జీవితకాలాన్ని మరో 20 ఏండ్లపాటు పెంచేందుకు దోహదపడే ఎఫ్ఆర్పీ (ఫైబర్-రీఇన్ఫోర్స్డ్ పాలిమెర్)ని ఆవిష్కరించినట్టు ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు. ఇది దేశ ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆకాంక్షించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ సూర్యప్రకాశ్, పీహెచ్డీ స్కాలర్ మల్లేశ్వర్రావు బృందం ఎఫ్ఆర్పీని అభివృద్ధి చేశారని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలకు గురైన పాత భవనాలు, బ్రిడ్జీలను సంరక్షించేందుకు ఇది దోహదం చేస్తుందని పేర్కొన్నారు. సాధారణంగా సంప్రదాయ పద్ధతుల్లో పాత భవనాల కాంక్రీట్‌ను మార్చడం లేదా పెంచడంతో ఆయా భవనాల పరిమాణం పెరిగే అవకాశం ఉంటుందని, ఎఫ్ఆర్పీ విధానంలో ఎలాంటి పరిమాణం పెరగకుండానే భవన సామర్థ్యాన్ని పెంచుతుందని చెప్పారు. తక్కువ ఖర్చుతో పాత భవనాలు, వంతెనల నిర్మాణాలను మరింత కాలం నాణ్యతతో కాపాడుకోవచ్చని వివరించారు. ఇప్పటికే 25కు పైగా అంతర్జాతీయ జర్నల్స్‌లో ఎఫ్ఆర్పీ గురించి ప్రచురితమైందని బీఎస్‌మూర్తి వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- FRP development
- Hybrid
- IITH
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

