
జమ్మికుంట, ఆగస్టు 9: మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఉద్ఘాటించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నదని, ముఖ్యంగా మహిళలకు భరోసా కల్పిస్తున్నదని చెప్పారు. జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన మహిళా సంఘాల నాయకు రాళ్లు, సభ్యులు టీఆర్ఎస్లో చేరగా, వారికి కండువా కప్పి ఆ హ్వానించా రు. తాటికొండ రేణుక, ఎండీ రహిమత్, మంజుల, నెల్లి పుష్ప క, రామ, దోమకొండ ప్రమీలతో పాటు సుమారు 50మంది టీఆర్ఎస్ లో చేరారు. ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు భరత్‌కుమార్‌రెడ్డి, అశోక్, పోలేపల్లి శంకర్‌రెడ్డి, ఐనవోలు మండల వైస్ ఎంపీపీ తంపుల మోహన్, డైరెక్టర్ సింగారపు రాజు, నాయకులు పాల్గొన్నారు.
గొల్ల, కుర్మలు ఆర్థికంగా ఎదిగేందుకు కేసీఆర్ సార్ చాలా కష్టపడుతుండు. కుటుంబాలు మంచిగ బతకాలనే గొర్రెలు అందించిండు. మా ఊరిలో ఉన్న గొల్ల, కుర్మలందరికీ గొర్రెలొచ్చినయ్. ఇప్పుడు ఎవలి పని వాళ్లు జేసుకుంట బతుకుతున్రు. చాలా సంతోషంగ ఉంది. ఇన్ని మంచి పనులు చేస్తున్న టీఆర్ఎస్తోనే మేం ఉంటం. వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి పనిచేస్తం. గెలిపిస్తం.
కమలాపూర్, ఆగస్టు 9: హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం ఉప్పలపల్లి గ్రామంలో యాదవ సంఘం సభ్యు లు టీఆర్ఎస్కే పట్టం కడుతామంటూ సోమవారం ఏకగ్రీవ తీర్మా నం చేశారు. ఈ తీర్మానం కాపీని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీ రాజారాం యాదవ్‌కు అందజేశారు. యాదవ సంఘం మండలాధ్యక్షుడు పోతనబోయిన రాజయ్య యా దవ్, తనుగుల ఐలయ్య యాదవ్, నరంగుల రాజు యాదవ్, బసవేయిన శ్రీనివాస్ యాదవ్, చేపూరి బాలరాజ్ యాదవ్, పాక లక్ష్మీ యాదవ్, గుండవోయిన లక్ష్మీ యాదవ్, తదితరులున్నారు.