హుజూరాబాద్ నియోజకవర్గానికి ఈటల రాజేందర్ చేసిందేమీ లేదు. ఆస్తులు సంపాదించుకుంటూ పోయిండు కానీ.. క్షేత్రస్థాయిలో అభివృద్ధి జరగలేదు. సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తే అవి కట్టించే బాధ్యత ఈటల రాజేందర్‌దే కదా? కనీసం ఒక్క ఊరిలో కూడా ఇండ్లు కట్టించలేదు. మొదటిసారి గెలిచినప్పుడు ఏదో కొంత అభివృద్ధి చేసిండు. రెండోసారి గెలిచిన తర్వాత అసలు అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. ముదిరాజ్ బిడ్డను అని చెప్పుకునే నీకు.. ఇప్పుడే గుర్తొచ్చారా? ముదిరాజ్‌లు. హుజూరాబాద్‌లో పక్కా టీఆర్ఎస్ అభ్యర్థే గెలుస్తడు.
– పల్లె రాజు ( మాదన్నపేట గ్రామం, కమలాపూర్ మండలం )
ఈరోజు మనం దేశంలో, ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టని పథకాన్ని కేసీఆర్ ప్రవేశపెట్టారు. దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుక దళితబంధును ప్రవేశపెట్టారు. ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలవబోతుంది. గతంలో ఎంతో మంది సీఎంలు వచ్చారు కానీ దళితుల గురించి ఆలోచించలేదు. దళిత బంధుతో దళితులందరూ అభివృద్ధి చెందుతారు. రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటాం. రైతు బంధు, రైతు బీమా అద్భుతమైన పథకాలు. ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ పార్టీకే మద్దతు ఇస్తాం. -సరిగొమ్ముల రాజ్‌కుమార్ ( ఉప్పల్ గ్రామం, కమలాపూర్ మండలం )
అన్ని వర్గాల సంక్షేమ కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుంది. ఇప్పుడు దళితుల అభివృద్ధి కోసం దళిత బంధు ప్రవేశపెట్టారు. ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టింది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పెరిగింది. హైదరాబాద్‌కు ఎన్నో కొత్త కంపెనీలు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తోంది. ఈ ప్రభుత్వం మరింత కాలం ప్రజా సేవలో ఉండాలి. టీఆర్ఎస్ పార్టీకి ఎల్లవేళలా అండగా ఉంటాం.
– అండ్రాసు సంపత్ ( ఉప్పల్ గ్రామం, కమలాపూర్ మండలం )