హైదరాబాద్: కార్తికమాసం (Kartika Masam) చివరి సోమవారం కావడంతో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. వేములవాడతోపాటు (Vemulawada) ప్రధానాలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. పెద్దసంఖ్యలో కార్తిక దీపాలను వెలిగించారు. దీంతో ఎములాడ రాజన్న దర్శనానికి మూడు గంటలకుపైగా సమయం పడుతున్నది.
ఇక భద్రాచలంలో భక్తుల కోలాహలం నెలకొన్నది. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి దీపాలను వెలిగించారు. వాటిని నదిలో వదిలారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైల మల్లికార్జునస్వామి వారి ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ధ్వజస్థాపం వద్ద దీపాలు వెలిగిందచి ప్రత్యేక పూజలు చూశారు.