హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ‘చలో ఎల్లమ్మగూడెం’ కార్యక్రమాన్ని చేపట్టనున్నామని బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాంయాదవ్, బీసీ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు వాసు కే యాదవ్, అఖిలభారత యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి లొడంగి గోవర్ధన్‌యాదవ్ గురువారం సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి భారీ ర్యాలీగా ఎల్లమ్మగూడెం బయలుదేరనున్నట్టు పేర్కొన్నారు. బీసీ బిడ్డ యాదగిరియాదవ్పై మంత్రి కోమటిరెడ్డి వర్గీయుల దాడి ఘటనపై నిరసన తెలుపనున్నట్టు పేర్కొన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
యాదగిరియాదవ్పై దాడి చేసి, మూత్రం తాగించిన ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దాడికి పాల్పడిన సందీప్‌రెడ్డి, ఆయనకు సహకరించిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన అభ్యర్థిని పోటీ నుంచి తప్పించి, బైండోవర్ చేయాలని కోరారు. బాధితుడికి, ఆయన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు.