Srisailam Dam | శ్రీశైలం : ఎగువ నుంచి శ్రీశైలం డ్యామ్‌కు వరద పోటెత్తుతున్నది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి వరద కొనసాగుతున్నది. ఈ క్రమంలో అధికారులు ప్రాజెక్టు ఏడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సుంకేశుల, జూరా ప్రాజెక్టుల నుంచి 1,37,399 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి డ్యామ్‌లో చేరుతున్నది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.70 అడుగుల మేర నీరుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 202.05 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతుంది. జల విద్యుత్ కేంద్రాల ద్వారా 65,651 క్యూసెక్కులు సాగర్‌కు వెళ్తున్నది. స్పిల్‌వే నుంచి 1.89లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుంది.