హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీలోని 24బార్లతోపాటు సరూర్‌నగర్, జల్పల్లి, మహబూబ్‌నగర్, నిజామాబాద్, బోధన్‌లో ఒక్కొక్క బార్‌కు రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. వాటికి ఇంకా మూడ్రోజులే గడువు ఉండటంతో అందరిచూపు జీహెచ్ఎంసీ బార్లపైనే ఉన్నట్టు ఎక్సైజ్‌వర్గాలు చెప్తుతున్నాయి.
ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలోని 24బార్లకు 356 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఏడాది మొదట్లో 25 కొత్తబార్లకు దరఖాస్తులు ఆహ్వానించగా, 1400 దరఖాస్తులు వచ్చాయి.