హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): పాలిటెక్నిక్‌లో థియరీకి 60శాతం, ప్రాక్టికల్స్‌కు 40శాతం చొప్పున వెయిటేజీని అమలు చేయనున్నారు. ఇదివరకు 50 శాతం చొప్పున వెయిటేజీ ఉండేది. సీ -24 పేరుతో పాలిటెక్నిక్ కొత్త కరికులాన్ని సాంకేతిక విద్యాశాఖ అధికారులు రూపొందించా రు. దీన్ని ‘ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్’ (ఎన్ఐటీటీటీఆర్) ఆ మోదానికి పంపించారు.
ఆమోదం పొందితే 2024 -27 వరకు మూడేండ్ల పాటు కరికులం అమల్లో ఉం టుంది. దీని రూపకల్పనకు అన్ని రాష్ర్టాల్లో అధ్యయనం చేశారు. చైనా, మలేషియా, సింగపూర్, థాయ్‌లాండ్ వంటి దేశాల్లోని కరికులాన్ని అధ్యయనం చేస్తున్నారు. ‘ఔట్ కమ్ బేస్డ్’ కరికులమే లక్ష్యంగా విద్యార్థులకు పరిశ్రమల్లో ఆరునెలల శిక్షణను తప్పనిసరి చేస్తున్నారు. యాడ్ ఆన్ కోర్సులు, మైనర్ కోర్సులకు ప్రాధాన్యమిచ్చారు. మేజర్ కో ర్సుల్లోని ఈసీఈ విద్యార్థులు ఎలక్ట్రానిక్స్‌ను మేజర్‌గా, సీఎస్ఈ కోర్సులోని ఏఐని మైన ర్ ప్రోగ్రాంగా తీసుకోవచ్చు. ఎన్‌పీటీఎల్, స్వయం పోర్టల్‌లో కోర్సులను ఎంచుకోవచ్చు.