Corona | హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): దీర్ఘకాల కొవిడ్ బాధితుల్లో నరాల సంబంధిత వ్యాధులు వస్తున్నాయని పరిశోధకులు తేల్చారు. ఒత్తిడి, ఆందోళనతోపాటు ఇతర మానసిక సమస్యలు ఎదురవుతున్నట్టు గుర్తించారు.
345 మందిపై పరీక్షలు చేయగా, దీర్ఘకాలిక కొవిడ్‌కు గురైన వారిలో మెదడు పనితీరు తేడాగా ఉన్నదని డెన్మార్క్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కొపెన్‌హెగెన్ పరిశోధకులు వెల్లడించారు. వారిని ఏడాదిపాటు పరీక్షించగా డిప్రెషన్ లక్షణాలు క్రమంగా పెరుగుతున్నాయని వివరించారు.