హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల జనరల్ ర్యాంకింగ్ లిస్టు(జీఆర్ఎల్)ను టీజీపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. జీఆర్ఎల్తోపాటు పైనల్ కీని సైతం ప్రకటించింది. డిసెంబర్ 23, 24, 29న వెల్ఫేర్ ఆఫీసర్, హాస్టల్ వార్డెన్ మ్యాట్రన్ పోస్టుల భర్తీకి పరీక్షలను నిర్వహించగా, ప్రాథమిక కీని విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించారు. వివరాలకు https://www. tspsc.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని టీజీపీఎస్సీ కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్ సూచించారు.