హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తేతెలంగాణ): ఉద్యాన పంటల ఉత్పత్తులు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ చేరేలా ‘ఇంటింటికీ ఉద్యాన ఉత్పత్తులు’ అనే కార్యక్రమాన్ని త్వరలోనే చేపట్టనున్నట్టు శ్రీ కొండాలక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ దండా రాజిరెడ్డి వెల్లడించారు. విశ్వవిద్యాలయ ప్రధాన కేంద్రంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యానరంగ అభివృద్ధికి కృత్రిమ మేధను అన్వయించేందుకు కావాల్సిన ప్రత్యేక కార్యాకరణను రూపొందిస్తున్నామని చెప్పారు.
ఆధునిక పద్ధతులతో పరిశోధన ఇంకుబేషన్ కేంద్రాలు, విద్యార్థుల కోసం స్టార్టప్ సంస్థలను ఏర్పాటు చేస్తున్నామని తె లిపారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంపునకే ‘జేఆర్ఎఫ్ కం కాంపిటేటివ్ సెల్’ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ భగవాన్, డీన్లు రాజశేఖర్, లక్ష్మీనారాయణ, శ్రీనివాసన్, కన్సల్టెంట్ వీరాంజనేయులు, వినోదిని, అసోసియేట్ డీన్లు ప్రశాంత్, సైదయ్య, అనితాకుమారి, యాదయ్య, రా మయ్య, వీరన్న, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.