హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ఎల్వీప్రసాద్ కంటి దవాఖాన చైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి ఎన్ రావుకు అరుదైన గౌరవం దక్కింది.
నేత్రవైద్య రంగంలో డాక్టర్ గుళ్లపల్లి అందిస్తున్న ఉత్తమ సేవలకు గుర్తింపుగా ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆప్తల్మాలజీ ఇటీవల కెనడాలోని వాంకోవర్లో జరిగిన ప్రపంచ ఆప్తల్మాలజి కాంగ్రెస్-2024లో ఆయనను ‘ఐసీవో జూల్స్ ఫ్రాన్సువా’ స్వర్ణపతకంతో సన్మానించింది.
దీంతో ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడిగా డాక్టర్ గుళ్లపల్లికి అరుదైన గౌరవం లభించింది.