చేవెళ్ల రూరల్, సెప్టెంబర్ 14 : యోగా ఆశ్రమ నిర్వాహకుడిని ఓ ముఠా హనీట్రాప్‌లో పడేసి భారీగా డబ్బు వసూలు చేసింది. బాధితుడు, గోల్కొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల వ్యవసాయ మారెట్ కమిటీ మాజీ చైర్మ న్ మిట్ట వెంకట రంగారెడ్డి ‘సీక్రెట్ ఆఫ్ నేచర్స్’ పేరిట యోగా కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. వెంకటరంగారెడ్డి వద్ద అధికంగా డబ్బు ఉన్నదని, ఎలాగైనా కొల్లగొట్టాలని ఇద్దరు మహిళలతో కలిసి అమర్ అనే వ్యక్తి ట్రాప్ చేసేందుకు ప్లాన్ వేశాడు. ఆగస్టు 6న ఉదయం హైదరాబాద్ నుంచి అమర్, మంజుల, రజిని యోగా కేంద్రానికి వచ్చారు. ఇద్దరు మహిళలకు ఆరోగ్యం బాగాలేదని వారిని అమర్ యోగా ఆశ్రమంలో చేర్పించాడు. తర్వాత వారు వెంకటరంగారెడ్డితో సన్నిహితంగా ఉన్నారు. రజిని వంట చేసి పెడుతూ దగ్గరైంది. రజినితో సన్నిహితంగా ఉన్నప్పుడు తెలియకుండా మత్తు పదార్థం కలిపిన జ్యూస్ ఇవ్వడంతో వెంకటరంగారెడ్డి మత్తులోకి వెళ్లేవాడు.
దీంతో రజిని ఆయనతో దగ్గరగా ఉన్నట్టు ఫొ టోలు, వీడియోలను స్పై కెమెరాతో తీసి వాటిని ముఠా సభ్యుడు అమర్‌కు పం పించేది. వాటిని వెంకటరంగారెడ్డికి చూ పించి డబ్బులు ఇవ్వాలని అమర్ బ్లాక్ మెయిల్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి పరువు తీస్తానని బెదిరించాడు. దీం తో బాధితుడు రూ.50 లక్షలు వారికి ఇచ్చి చేవెళ్లకు వచ్చాడు. మరిన్ని డబ్బులు కావాలంటూ అమర్ ఫోన్లు చేస్తూ వేధించడంతో వెంకటరంగారెడ్డి ఈ నెల 4న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆనంద్‌ను కలిసి జరిగింది చెప్పాడు. పోలీసు లు ముఠా సభ్యులను పట్టుకునేందుకు పక్కాగా ప్లాన్ వేసి ఈ నెల 13న హైదరాబాద్‌లోని తారామతి బారామతి హోట ల్కు రప్పించారు. అక్కడే మఫ్టీలో ఉన్న గోల్కొండ పోలీసులు ముఠా సభ్యులైన అమర్, మౌలాలి, రాజేశ్, మంజుల, రజినిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.