గజ్వేల్, అక్టోబర్ 16: దేశంలోని అన్ని రాష్ర్టాల కన్నా తెలంగాణ పోలీస్ వ్యవస్థ పటిష్ఠంగా ఉన్నదని హోంమంత్రి మహమూద్‌అలీ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్‌లో రూ.3 కోట్లతో నిర్మించిన మోడల్ పోలీస్ సిబ్బంది విశ్రాంతి భవనం, డైనింగ్హాల్ను శుక్రవారం డీజీపీ మహేందర్‌రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్‌గుప్తా, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. శాంతిభద్రతలు అదుపులో ఉన్న రాష్ర్టాలు ఎక్కువగా అభివృద్ధి చెందుతాయని మహమూద్‌అలీ అన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేశామన్నారు. కార్యక్రమంలో వెస్ట్‌జోన్ ఐజీ శివశంకర్‌రెడ్డి, కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, సీపీ జోయల్ డెవిస్ పాల్గొన్నారు.