మంగళవారం 26 జనవరి 2021
Telangana - Dec 27, 2020 , 18:24:36

‘ద సన్ ఆఫ్ తెలంగాణ’ పుస్తకాన్ని ఆవిష్కరించిన హోంమంత్రి

‘ద సన్ ఆఫ్ తెలంగాణ’ పుస్తకాన్ని ఆవిష్కరించిన హోంమంత్రి

హైదరాబాద్‌ :  రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ బయోగ్రఫీ ఆధారం సీనియర్ జర్నలిస్ట్ రియాజ్ అలీ రజ్వి రచించిన  ‘ద సన్ ఆఫ్ తెలంగాణ’ పుస్తకాన్ని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఆవిష్కరించారు.ఆదివారం గన్‌ఫౌండ్రిలోని మీడియా ప్లస్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌తో కలిసి హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొన్ని పుస్తకాన్ని ఆవిష్కరించారు.

తెలంగాణ ముస్లిం మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ మసూద్ జాఫ్రీ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వై. సునీల్‌ రావు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు సీ విఠల్,  ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉర్దూ విభాగం విశ్రాంత అధిపతి డాక్టర్‌ మజీద్ బెదర్, పుస్తక రచయిత మహమ్మద్ రియాజ్ అలీ రజ్వి తదితరులు పాల్గొన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo