హైదరాబాద్, డిసెంబర్ 13(నమస్తే తెలంగాణ): తెలంగాణలోని పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు 2023లో పండుగలు, జాతీయ పర్వదినాల సందర్భంగా వేతనంతో కూడిన సెలవు దినాలను కార్మికశాఖ ప్రకటించింది. తెలంగాణ ఫ్యాక్టరీస్, ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ప్రకారం జనవరి 14 భోగి, గణతంత్ర దినోత్సవం, మార్చి 22న ఉగాది, ఏప్రిల్ 22న రంజాన్, మేడే, స్వాతంత్య్ర దినోత్సవం, గాంధీ జయంతి, అక్టోబర్ 24న విజయదశమి సందర్భంగా వేతనంతో కూడిన సెలవులు ఉంటాయని రంగారెడ్డి జోన్ సంయుక్త లేబర్ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. ఇవే సెలవులు రాష్ట్రమంతా వర్తిస్తాయని స్పష్టంచేశారు. అలాగే, తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ప్రకారం దుకాణాలు, సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు వీటితోపాటు ఫిబ్రవరి 18న మహాశివరాత్రి, జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వేతనంతో కూడిన సెలవులు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.