Crime News | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపాన గల ఆల్ఫా హోటల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. ఆల్ఫా హోటల్ లో బాంబు పెట్టామని ఓ ఆగంతకుడు డయల్ 100 ఫోన్ నంబర్‌కి ఫోన్ చేసి చెప్పాడు.దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆల్ఫా హోటల్‌ను మూసివేశారు. బాంబు స్క్వాడ్ ఆల్ఫా హోటల్ లో అణువణువూ తనిఖీ చేస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సింది. ఈ బాంబు బెదిరింపుతో చుట్టు పక్కల ప్రాంతాల వాసులు భయాందోళనకు గురయ్యారు.