గోవా డ్రగ్స్ మాఫియాపై హెచ్‌న్యూ పంజా
- అంతర్రాష్ట్ర ముఠాలకు పోలీసుల చెక్
- గోవాలో దుస్థితిపై హెరాల్డ్ కథనం
- హెచ్‌న్యూ సహకారం తీసుకోండి
- గోవా పోలీసులకు సావంత్ సూచన
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్‌పై కఠినంగా వ్యవహరించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెం ట్ వింగ్ (హెచ్‌న్యూ) పోలీసులు డ్రగ్స్ మాఫియాపై పంజా విసురుతున్నారు. గ్రాము డ్రగ్ దొరికినా మూలాల్లోకి వెళ్లి కూకటివేళ్లతో పెకిలిస్తున్నారు. గోవాలో రోజుల తరబడి తిష్టవేసి, మత్తు సామ్రాజ్యపు పునాదులను కదిలిస్తున్నా రు. ఒక్క తెలంగాణకు సంబంధించిన ముఠాలే కాదు.. అంతర్రాష్ట్ర ముఠాల పనీ పడుతున్నా రు.
అందుకు ప్రితీశ్ నారాయణ్ బోర్కర్ అలియాస్ బాబు కేసే అందుకు నిదర్శనం. అయి తే, గోవాలో హెచ్‌న్యూ పోలీసులు డ్రగ్స్ మాఫియా పని పడుతుంటే.. గోవా పోలీసుల నుంచి ఉలుకు పలుకు లేకపోవటం గమనా ర్హం. అసలు గోవా పోలీసులు నిద్రపోతున్నా రా? అని హెరాల్డ్ ఆంగ్ల దినపత్రిక వారిని ప్ర శ్నించింది. హెచ్‌న్యూ పనితీరును ప్రశంసించింది. గత నెల 16న హెచ్‌న్యూ పోలీసులు బోర్కర్‌ను అరెస్టు చేసి, అధికారికంగా వివరాలు వెల్లడిస్తే గోవా పోలీసులు కనీసం ఆ వివరాలను తెలుసుకొనే ప్రయత్నం చేయలేదని ఆక్షేపించింది. ఇందుకు తెలంగాణ పోలీసుల నుంచి అధికారి ఆహ్వానం అందాలా? అంటూ చురకలు అంటించింది. ఈ డ్రగ్స్ ముఠాపై గోవా పోలీసులకు క్లూస్ లేవా? లేనట్టు నటిస్తున్నారా? అని ఆ పత్రిక నిలదీసింది.
ఎవరీ బోర్కర్?
హెచ్‌న్యూ పోలీసులు అరెస్టు చేసిన బోర్కర్‌ను.. 2014లోనే గోవాలోని అంజునా పోలీసులు అరెస్టు చేశారు. అయినా ఎనిమిదేండ్లుగా అతడు అడ్డూ అదుపూ లేకుండా డ్రగ్స్ వ్యాపారం చేస్తూనే ఉన్నాడు. అంజునా బీచ్‌లో డ్రగ్స్ విక్రయిస్తూనే ఉన్నాడు. ఏకంగా దేశవ్యాప్తంగా 600 మందితో నెట్‌వర్క్‌ను విస్తరించుకొన్నాడు.
తెలగాణ బీజేపీ నేతల తీరిదీ
వాస్తవానికి గోవా నుంచే అధికంగా ఇతర రాష్ర్టాలకు డ్రగ్స్ సరఫరా జరుగుతుందనేది బహిరంగ రహస్యం. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా హెచ్న్యూను ఏర్పాటు చేసి డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించింది. హెచ్‌న్యూ పోలీసులు వరుస దాడులతో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాల భరతం పడుతున్నారు. దీంతో హైదరాబాద్ వంక చూసేందుకు ఆ ముఠాలు జంకుతున్నాయి. బీజేపీ పాలిత గోవాలో డ్రగ్స్ ముఠాల సమాచారమూ అక్కడి పోలీసుల కంటే మన పోలీసుల వద్దే ఎక్కువగా ఉన్నది. గోవాలో డ్రగ్స్ ముఠాల ఆట కట్టించేందుకు హెచ్‌న్యూ సహకారం తీసుకోవాలని స్వయంగా ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ గోవా పోలీసులకు సూచించినట్టు హెరాల్డ్ తన కథనంలో పేర్కొన్నది. అయితే, ఇతర రాష్ర్టాల వారు మన పోలీసుల పనితీరును ప్రశంసిస్తుంటే ఇక్కడి బీజేపీ నాయకులు మాత్రం.. హైదరాబాద్ నగరం డ్రగ్స్‌కు అడ్డాగా మారిందని అసత్య ఆరోపణలు చేయడమేంటో వారికే తెలియాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

