హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్(హెచ్ఎంఏ) ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని లండన్ మేనేజ్మెంట్ అకాడమీలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(ఈడీపీ) పేరుతో మూడు రోజుల వర్క్‌షాప్ ప్రారంభించారు. విద్యార్థులను ఉద్యోగాల సృష్టికర్తలుగా తీర్చిదిద్దడంతోపాటు వారిలో నాయకత్వ నైపుణ్యాలు పెంపొందించడం, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన ఆలోచనలు కలిగించడం వంటి లక్ష్యాలతో ఈ వర్క్‌షాప్ ఏర్పాటుచేసినట్టు నిర్వాహకులు తెలిపారు.
ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్‌టీసీసీఐ) మహి ళా విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 12న రెడ్‌హిల్స్‌లోని ఫెడరేషన్ కార్యాలయంలో ఏఐపై మహిళల కోసం ప్రత్యేక వర్క్‌షాప్ ఏర్పాటు చేయనున్నట్టు అధ్యక్షుడు ఆర్ రవికుమార్ తెలిపారు. ఐబీఎం, ఐఎస్బీలకు చెందిన నిపుణులు ఏఐకి సంబంధించిన వివరాలతోపాటు కేస్ స్టడీస్ అందిస్తారని చెప్పారు.