జగిత్యాల, జనవరి 12 (నమస్తే తెలంగాణ): జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రంగధామునిపల్లి, పెగడపల్లి మండలం దీవికొండ గ్రామ శివారులో చారిత్రక ఆనవాళ్లు లభించాయి. కాళేశ్వరం లింక్ కాలువ పనులను చేపడుతున్న సమయంలో రంగధామునిపల్లి శివారులోని కొసనూరుపల్లి సమీపంలో ఉన్న పెద్ద బం డరాయికి నిలువెత్తు భైరవ విగ్రహం కనిపించింది. మధ్యయుగాకి చెందిన మూడున్నర అడుగుల స్తంభభాగం లభించింది. పిల్లర్ దిగువభాగంలో కుంభపంజరం ఉండటంతో కల్యాణి చాళుక్యులు లేదా కాకతీయుల కాలంనాటి ఆలయం ఇక్కడ ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. కానీ, ఆలయ ఆనవాళ్లు లభించలేదు. గతంలో కొసనూరిపల్లి, సమీపంలోని దీవికొం డ, లక్ష్మీపూర్లోనూ చారిత్రక ఆనవాళ్లు లభించాయి. పెద్ద కొండపై తోరణం, గోడ నిర్మాణ ఆనవాళ్లు, కోనేరు ఉన్నట్టు గ్రామస్థులు తెలిపారు. దీవికొండ కొండను ఆనుకొని కిలోమీటర్ల పొడవున విస్తరించిన కొండల దిగువన బృహత్ శిలా సమాధులు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు గ్రామంలో మూడు భైరవ విగ్రహాలు ద ర్శనమిచ్చాయి. ఇవన్నీ గుట్టబోర్లకు, బండరాళ్లకు చె క్కారు. రంగధామునిపల్లి పొలాల్లో ధ్వజస్తంభం, రోళ్లు ఉన్నాయి. రంగధాముని ఆలయంలో కల్యాణి చాళుక్యులు లేదా కాకతీయుల కాలానికి సంబంధించిన శా సనం కనిపిస్తున్నది. అక్షరాలు దెబ్బతినడంతో దాన్ని గుర్తించాల్సి ఉన్నది. గ్రామంలో జే అనీల్ అనే యువకుడు ఐరన్‌ఓర్ ముద్దలను గుర్తించి వాటి చిత్రాలను ప్రిహా సభ్యులకు పంపించగా, రంగధామునిపల్లి, కొసనూరిపల్లి, దీవికొండ చారిత్రక ప్రాంతాలని తెలిపారు.