హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): ఇం ధన సామర్థ్య నిర్వహణలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శమని సెంట్రల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ హీరాలాల్ సమారియా కొనియాడారు. ఆదివారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నెడ్‌క్యాప్ సౌజన్యంతో నిర్వహించిన విద్యుత్తు శాఖకు చెందిన మిషన్‌లైఫ్ దక్షిణాది రాష్ర్టాల సమావేశంలో ఆయన మాట్లా డారు. ప్రపంచస్థాయి నగరాలతో పోటీ పడుతూ అన్ని రం గాల్లో అగ్రభాగాన నిలుస్తున్న హైదరాబాద్‌లో మిషన్‌లైఫ్ వంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ప్రజల్లో అవగాహన మరింత పెరుగుతుందని తెలిపారు. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా మిషన్‌లైఫ్ లక్ష్యాలు ఉన్నాయని వివరించారు. 2028 నాటికి భారత్‌లోని 80% గ్రామాలు, పట్టణ స్థానికసంస్థల్లో పర్యావరణ అనుకూల పద్ధతులను అవలంభించేలా ప్రోత్సహించడమే మిషన్‌లైఫ్ లక్ష్యమని పేర్కొన్నారు. సందర్భంగా మిషన్‌లైఫ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంసీహెచ్చార్డీఏ డైరెక్టర్ జనరల్, డాక్టర్ శశాంక్‌గోయల్, బీఈఈ మీడియా అడ్వైజర్ ఏ చంద్రశేఖర్‌రెడ్డి, నెట్కాప్ ఎండీ జానయ్య తదితరులు పాల్గొన్నారు.