అర్చకులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇవ్వాలి
రాష్ట్రంలోని 6 ఏ, 6 బీ, 6 సీ దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చక ఉద్యోగులందరికీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలివ్వాలని తెలంగాణ అర్చక సమాఖ్య ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. దేవాదాయ అధికారులు 2014 జూన్ రెండు వరకు ఉన్న అర్చకులకు మాత్రమే గ్రాంట్ ఇన్ ఎయిడ్ అమలుచేస్తున్నారని
మంత్రికి తెలంగాణ అర్చక సమాఖ్య వినతి
హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 6 ఏ, 6 బీ, 6 సీ దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చక ఉద్యోగులందరికీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలివ్వాలని తెలంగాణ అర్చక సమాఖ్య ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. దేవాదాయ అధికారులు 2014 జూన్ రెండు వరకు ఉన్న అర్చకులకు మాత్రమే గ్రాంట్ ఇన్ ఎయిడ్ అమలుచేస్తున్నారని, దీనివల్ల అనేకమంది అర్హులైన అర్చకులకు అన్యాయం జరుగుతున్నదని పేర్కొన్నారు. ఈ మేరకు సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ నేతృత్వంలో సభ్యులు మంగళవారం అరణ్యభవన్‌లో దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వెంటనే అర్చక ట్రస్టును ఏర్పాటుచేసి అందులో అర్చక సమాఖ్యకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. గ్రేటర్ వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ తదితర కార్పొరేషన్ల పరిధిలోని అర్చకులకు కూడా ధూప, దీప నైవేద్య పథకాన్ని విస్తరించాలని విజ్ఞప్తిచేశారు. తమ విజ్ఞప్తిపై మంత్రి అల్లోల సానుకూలంగా స్పందించి అధికారులు ఆదేశాలిచ్చినట్టు ఉపేంద్రశర్మ తెలిపారు. మంత్రిని కలిసినవారిలో అర్చక, ఉద్యోగ జేఏసీ ఉపాధ్యక్షుడు టీ రాజేశ్వరశర్మ, గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ అర్చక సమాఖ్య అధ్యక్షుడు రఘు కిరణాచార్యులు తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- demand
- Grant in aid
- Hindu
- Priest
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

