హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): నూతన సచివాలయం ఆవరణలో పు నర్నిరించిన నల్లపోచమ్మ ఆలయంలో ప్రతిష్ఠించనున్న దేవతామూర్తుల రాతి విగ్రహాలు సిద్ధమయ్యాయి. వీటిని ఒకట్రెండు రోజుల్లో టీటీడీకి చెందిన ప్రత్యేక వాహనంలో తిరుపతి నుంచి హైదరాబాద్కు తీసుకురానున్నారు. నల్లపోచమ్మ ఆలయంలో వినాయకుడు, సు బ్రహ్మణ్యస్వామి, అభయాంజనేయస్వామి, సింహవాహనం, నందివాహనం, పానవట్టం తో కూడిన శివలింగం ప్రతిష్ఠించనున్నారు.
విగ్రహాలను టీటీడీకి చెందిన శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ స్కల్ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్వీఐటీఎస్ఏ) ఆధ్వర్యంలో త యారు చేయించారు. ఇందుకు రూ. 1,19,252 ఖర్చయింది. టీటీడీ 75 శా తం రాయితీతో అందజేస్తున్నది. విగ్రహాల ప్ర తిష్ఠాపనకు ముహూర్తం నిర్ణయించాల్సి ఉన్నది.