నిర్మల్ : ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) మనుమడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) తనయుడు కల్వకుంట్ల హిమాన్షురావు(Himanshu Rao) బుధవారం నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి(Basar Saraswati) అమ్మవారిని స్నేహితులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గోదావరి బ్రిడ్జి వద్ద ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి(Mla Vittal Reddy), బీఆర్ఎస్ శ్రేణులు హిమాన్సుకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆలయం వరకు బైక్ ర్యాలీ(Bike Rally) నిర్వహించారు.
ఆలయం వద్ద ఆలయ పండితులు(Temple Scholars) హిమాన్సుకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనను శాలువాతో సన్మానించి , అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. మహంకాళి ఆలయం వద్ద కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి యాదాద్రి(Yadadri) శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనార్థం యాదగిరిగుట్టకు బయలు దేరారు.