హైదరాబాద్: అమెరికాకు చెందిన గాయకుడు, గేయ రచయిత జాకబ్ లాసన్ (JVKE) పాడిన ‘గోల్డెన్ అవర్’ సాంగ్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు అద్భుతంగా ఆలపించారు. ఈ ఇంగ్లిష్ సాంగ్ అలాపనలో హిమాన్షు ఆంగ్ల యాసను ఉచ్ఛరించిన తీరు ఆమోఘంగా ఉంది. అచ్చం జాకబ్ లాసన్‌ను తలపించేలా అతను ఈ కవర్ సాంగ్ పాడాడు.
ఈ పాటకు సంబంధించిన వీడియోను హిమాన్షురావు ‘గోల్డెన్ అవర్ X హిమాన్షు కవర్’ పేరుతో తన యూట్యూబ్‌లో ఛానెల్లో షేర్ చేశారు. ఈ సాంగ్‌పై నెటిజన్ల నుంచి కామెంట్ల వర్షం కురుస్తున్నది. హిమాన్షు తండ్రి, మంత్రి కేటీఆర్ కూడా పాటకు ఫిదా అయ్యారు. ‘సూపర్ ప్రౌడ్ అండ్ ఎగ్జయిటెడ్ ఫర్ మై సన్’ అంటూ మంత్రి తన ట్విటర్ ఖాతాలో రీట్వీట్ చేశారు. ‘I loved it; Hope you all do too’ అంటూ మెచ్చుకున్నారు.
Super proud and excited for my son @TheRealHimanshu 😊
I loved it; Hope you all do too ❤️ https://t.co/obmjzwE9SK
— KTR (@KTRBRS) February 17, 2023
Thank you Dadda 😊❤️ https://t.co/3AOGez4KIY
— Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) February 17, 2023
తండ్రి రీట్వీట్‌కు హిమాన్షు రావు థ్యాంక్యూ డాడీ అంటూ రిప్లై ఇచ్చారు. కాగా, ఈ సాంగ్‌ను యూట్యూబ్‌లో పోస్టు చేసిన రెండు గంటల్లోనే 5,500 మందికిపైగా వీక్షించారు. మరి ఇంత వైరల్ అవుతున్న హిమాన్షు సాంగ్‌పై మీరూ ఓ లుక్కేస్తారా..?