Indian Truck Drivers | అమెరికాలో డ్రగ్స్ తో పట్టుబడ్డ భారత డ్రైవర్లు.. లక్ష మందిని చంపేంత కొకైన్ లభ్యం
Indian Truck Drivers : అమెరికాలో ఇద్దరు భారత ట్రక్ డ్రైవర్లు భారీ కొకైన్ తో పట్టుబడ్డారు. ఆ కొకైన్ విలువ మన కరెన్సీలో దాదాపు రూ.62 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
Indian Truck Drivers : అమెరికాలో ఇద్దరు భారత ట్రక్ డ్రైవర్లు భారీ కొకైన్ తో పట్టుబడ్డారు. ఆ కొకైన్ విలువ మన కరెన్సీలో దాదాపు రూ.62 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇండియానా పరిధిలో హైవేపై పోలీసులు తనిఖీలు చేస్తుండగా, ఇద్దరు భారత డ్రైవర్లు ట్రక్కులో తరలిస్తున్న కొకైన్ ను పోలీసులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. అయితే, తమ ట్రక్కులో కొకైన్ ఉందనే విషయం తెలియదని నిందితులు చెబుతున్నారు.
పట్టుబడ్డ డ్రైవర్లను గుర్ ప్రీత్ సింగ్ (25), జస్వీర్ సింగ్ (30)గా గుర్తించారు. అమెరికన్ మీడియా కథనం ప్రకారం.. నిందితులు ఇద్దరూ కొంతకాలం క్రితం వేర్వేరుగా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించారు. ఇక్కడ డ్రైవర్లుగా పని చేస్తున్నారు. వీరు ట్రక్కులో రిచ్ మండ్ వెళ్తుండగా.. ఇండియానా పోలీసులు హైవేపై తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆ ట్రక్కులో డ్రగ్స్ ఉన్న విషయాన్ని శునకాలు పసిగట్టాయి. దీంతో అనుమానం వచ్చి పోలీసులు తనిఖీ చేయగా.. డ్రైవర్ల స్లీపర్ బెర్త్ కింద పదుల సంఖ్యలో కార్డ్ బోర్డ్ బాక్సుల్ని గుర్తించారు. వాటిని తెరిచి చూడగా అందులో నిషేధిత కొకైన లభించింది. ఇది మొత్తం 309 పౌండ్లుగా ఉంది. దీని విలువ మన కరెన్సీలో దాదాపు రూ.62 కోట్లుపైగానే ఉంటుంది.
ఈ కొకైన్ తో 1,13,000 మందిని చంపొచ్చని పోలీసులు అంటున్నారు. దీనిపై నిందితులు మాట్లాడుతూ.. తమకు అందులో డ్రగ్స్ ఉన్న విషయం తెలియదని చెప్పారు. రిచ్మండ్లోని ఒక ఇండియన్ రెస్టారెంట్ కు వెళ్లాల్సిందిగా యజమానులు సూచించారని, అక్కడ లోడ్ చేస్తారని చెప్పారని, దీంతో తాము ట్రక్కు తీసుకుని బయల్దేరామని తెలిపారు. డ్రగ్స్ తో తమకేం సంబంధం లేదని చెప్పారు. ప్రస్తుతం పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Cocaine
- Indian
- truck drivers
- US
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

