Panchayat Elections : తెలంగాణలో తొలి విడత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. 45,15,141 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫలితంగా మొదటి దఫా ఎలక్షన్స్‌లో 84.28 పోలింగ్ నమోదైంది. యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 92.88 ఓటింగ్ నమోదైంది. భద్రాద్దరి జల్లా కొత్తగూడెంలో అత్యల్పంగా 71.79 శాతం ఓటింగ్ రిజిష్టరైంది. ఆశ్చర్యంగా.. తొలి విడతలో మూడు సర్పంచి స్థానాలు లాటరీ ద్వారా తేలాయి.
యాదాద్రి జిల్లా లక్ష్మక్కపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్ధులకు 148 ఓట్లు వచ్చాయి. దాంతో, విజేతను తేల్చడం కోసం అధికారులు లాటరీ తీశారు. లాటరీలో బీఆర్ఎస్ అభ్యర్థి ఇండ్ల రాజయ్య సర్పంచ్‌గా ఎంపికయ్యారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం సూరం పల్లిలోనూ లాటరీ తప్పలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులకు సమానంగా 276 ఓట్లు వచ్చాయి. లాటరీ తీయగా బీఆర్ఎస్ బలపరిచిన మైలారం పోచయ్య సర్పంచ్ అయ్యారు.
తెలంగాణ సర్పంచ్ మొదటి విడత ఎన్నికల ఫలితాలు అప్డేట్
ఈరోజు వెలువడిన ఫలితాలు ఇప్పటివరకు
కాంగ్రెస్ 816
బీఆర్ఎస్ 464
బీజేపీ 89
ఇతరులు 205ఏకగ్రవంగా ఎన్నుకున్న స్థానాలు
కాంగ్రెస్ 303
బీఆర్ఎస్ 47,
బీజేపీ 6
ఇతరులు 39మొత్తంగా
కాంగ్రెస్ – 1119
బీఆర్ఎస్ – 511
బీజేపీ – 95
ఇతరులు – 244— Telugu Scribe (@TeluguScribe) December 11, 2025
రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం చిన్న ఎల్క చెర్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్ధులకు 212 ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్‌లోనూ ఇద్దరికీ సమాన ఓట్లు రావడంతో అధికారులు.. టాస్ వేశారు. టాస్‌లో.. కాంగ్రెస్ అభ్యర్తి మరాఠి రాజ్‌కుమార్‌ను అదృష్టం వరించింది. ఇక రేగోడ్ మండలం కొండాపూర్‌లో ఒక్క ఓటు తేడాతో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి బేగరి పాండరి గెలుపొందారు.