హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): దేశంలో ఈ ఏడాది రుతుపవన కాలం సమయంలో మంచి వానలు (సాధారణ వర్షపాతం) కురుస్తాయని ప్రైవేటు వాతావరణ సంస్థ సైమెట్ అంచనా వేసింది. సీజన్ రెండో అర్ధ భాగంలో అధిక వర్షాలు పడుతాయని పేర్కొన్నది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య నాలుగు నెలల కాలానికి దీర్ఘకాల సగటు(ఎల్పీఏ) 868.6 మిల్లీమీటర్లలో 102 శాతం వర్షపాతం(ఎర్రర్ మార్జిన్ 5%) నమోదు అవుతుందని చెప్పింది. దక్షిణ, పశ్చిమ, వాయువ్య ప్రాంతాల్లో సరిపడా మంచి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈశాన్య భారతంలో రుతుపవన సీజన్ మొదటి సగంలో సాధారణం కంటే తకువ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఎల్పీఏలో 96-104 శాతం మధ్య వర్షాల పడితే సాధారణ వర్షపాతంగా పేర్కొంటారు.
ఎల్నినో నుంచి లానినోకు..
బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ వర్షపాత లోటును ఎదురొంటాయని సైమెట్ ఎండీ జితిన్ సింగ్ తెలిపారు. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఏపీ, గోవాలో సాధారణం కంటే ఎకువ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఎల్నినో నుంచి లానినాకు మారడం వల్ల సాధారణ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఎల్ కాకుండా ఐవోడీ వంటి ఇతర అంశాలు కూడా రుతుపవనాలను ప్రభావితం చేస్తాయని వెల్లడించారు. ఎల్ నుంచి లానినాకు వేగవంతమైన మార్పు సీజన్ ప్రారంభానికి అంతరాయం కలిగిస్తుందని అంచనా వేశారు.
సానుకూలంగా ‘నైరుతి’
ఈ ఏడాది ఎల్ పరిస్థితులు తగ్గిపోవడం, యురేషియాలో తగ్గిన మంచు కవచంతో నైరుతి రుతుపవనాలు సానుకూలంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ మహాపాత్ర ఇటీవల తెలిపారు. మనదేశంలో ఎల్నినో క్షీణిస్తుండటం శుభపరిణామంగా పేర్కొన్నారు. జూన్ నెల మొదలయ్యే సమయానికి ఎల్నినో తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. అదే జరిగితే నైరుతి రుతుపవనాలు యాక్టివ్ అవుతాయన్నారు. రుతుపవనాల సీజన్ జూన్-సెప్టెంబర్ రెండో అర్ధభాగంలో మన దేశంలో లానినా పరిస్థితులు ఏర్పడొచ్చునని ఆయన తెలిపారు. దేశంలో రుతుపవనాలపై ఉత్తర హిమాలయాలు, యురేషియా భూభాగంపై ఉండే మంచు కవచం ప్రభావం చూపిస్తాయని మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. ‘ఎల్నినో’ ఎఫెక్ట్ ఎకువగానే ఉంటుందని చెప్పారు.