TGCHE | హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఉన్నత విద్యామండలి డిగ్రీ మూడో సంవత్సరంలో లాంగ్వేజెస్‌కు టాటా చెప్పనుంది. థర్డ్ ఇయర్‌ను కేవలం కోర్ సబ్జెక్టులకే పరిమితం చేయనుంది. ఇక నుంచి లాంగ్వేజెస్ ఫస్ట్, సెకండియర్లోనే చదవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ విషయంపై ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకోగా, 2025-26 విద్యాసంవత్సరంలో ఇది అమల్లోకి రానుంది.
వాస్తవానికి ఈ విధానమే గతంలో అమలైంది. కానీ 2021లో డిగ్రీ కోర్సులను సంస్కరించడంలో భాగంగా ఉన్నత విద్యామండలి థర్డ్ ఇయర్లో లాంగ్వేజెస్‌ను చేర్చింది. నాలుగేండ్లు దాటకుండానే ఈ నిర్ణయంపై అదే ఉన్నత విద్యామండలి యూ టర్న్ తీసుకుంది. అయితే అప్పుడు నిర్ణయం తీసుకున్న వారిలో ఎవరు ఇప్పుడు ఉన్నత విద్యామండలిలో లేరు.
డిగ్రీ థర్డ్ ఇయర్లో ప్రాజెక్ట్ వర్క్‌ను తప్పనిసరి చేశారు. ప్రాక్ట్రికల్స్‌కు బదులుగా ప్రాజెక్ట్‌ను అంతర్భాగం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతానికి ఇంజినీరింగ్ సహా కొన్ని కోర్సుల్లో మాత్రమే ప్రాజెక్ట్ వర్క్‌ను అమలుచేస్తున్నారు. ప్రాజెక్ట్ వర్క్‌కు క్రెడిట్స్ ఉంటాయి. ఆ క్రెడిట్స్‌ను విద్యార్థులు క్లెయిమ్ చేసుకోవచ్చు. మూక్స్-స్వయం, ఎన్‌పీటీఎల్ వంటి ఆన్లైన్ వేదికల ద్వారా అభ్యసించిన కోర్సుల క్రెడిట్స్‌ను సైతం క్లెయిమ్ చేసుకునే అవకాశాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.