కరీంనగర్ విద్యానగర్, జూలై 12 : క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన డెకర్బీ జాయిన్ 500 ఎంజీ 23 వాయల్స్పై ఎమ్మార్పీ కంటే అధిక ధర ఉన్నట్టు గుర్తించి సంబంధిత ఫార్మా కంపెనీపై కేసు నమోదు చేసినట్టు కరీంనగర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్తీక్ భరద్వాజ్ తెలిపారు. డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ (డీపీసీవో) ప్రకారం ఎమ్మార్పీ రూ.518 కాగా, వాటిపై రూ.1,250 ఉన్నట్టు గుర్తించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా కరీంనగర్‌లోని ఓ ఏజెన్సీలో శుక్రవారం తనిఖీ చేయడంతో ఈ వ్యవహారం బయటపడిందని, సంబంధిత ఫార్మాస్యూటికల్ కంపెనీపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని పేరొన్నారు.
19 మంది జీపీల నియామకం
హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): హైకోర్టులో 19 మందిని ప్రభుత్వ న్యాయవాదులుగా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నియమించింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి పేరిట జీవో 399 వెలువడింది. వీరంతా మూడేండ్లపాటు ఆ పదవుల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది.
పసికందు విక్రయం
చార్మినార్, జూలై 12: కనికరం లేకుండా కన్నబిడ్డను అమ్మకానికి పెట్టాడో తండ్రి. హైదరాబాద్ బండ్లగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ సత్యనారాయణ శుక్రవారం వివ రాలను వెల్లడించారు. మొహమ్మద్ నగర్ వాసులైన ఆసిఫ్, అస్మాబేగందంపతులకు ఇటీవలే ఓ పాప జన్మించింది. చిన్నారిని ఎలాగైనా అమ్మి సొ మ్ము చేసుకోవాలని తండ్రి ఆసిఫ్ నిర్ణయించుకున్నాడు. అదే ప్రాంతానికి చెందిన చాంద్ సుల్తానాను సంప్రదించాడు. కర్ణాటక రాష్ర్టానికి చెందిన మినాల్ సాద్‌ను సంప్రదించి లక్ష రూపాయలకు ఆ పసికందును కొ నేందుకు ఒప్పందం కుదుర్చుకున్నా రు. అస్మాబేగంను భయపెట్టి చిన్నారిని మినాల్ సాద్‌కు ఆసిఫ్ అప్పగించాడు. జరిగిన ఉదంతంపై అస్మాబే గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు చిన్నారిని రక్షించి నగరానికి తీసుకొచ్చారు. ఆసిఫ్, చాంద్ సుల్తానా, మినాల్సాద్ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.