హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ)లో మౌలిక వసతి సదుపాయాలు అభివృద్ధి చేయడానికి, ప్రపంచస్థాయి యూనివర్సిటీగా మార్చడం కోసం రూ.1000 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటైన హైపవర్ కమిటీ శనివారం సమావేశమైంది.
ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు ఆధ్వర్యంలో ఐఎస్బీ, ఐఐటీ హైదరాబాద్ వంటి ప్రముఖ విద్యాసంస్థలతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఓయూ అభివృద్ధి కోసం కావాల్సిన ముసాయిదా అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కమిటీ వారం లో మరోసారి సమావేశం కానున్నది.