హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్య స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. విద్యాప్రమాణాలు, నాణ్యతను పర్యవేక్షించనున్నది. ఇందుకోసం 7 రాష్ట్రస్థాయి బృందాలను నియమించింది.
ఈ బృందాలు ఈ నెల 10 నుంచి జిల్లాలవారీగా తనిఖీలు చేయనున్నాయి. సిలబస్ పూర్తయ్యిందా.. లేదా..? ఎస్సెస్సీ యాక్షన్ ప్లాన్ అమలెలా ఉన్నది అనే విషయాలను తనిఖీ చేస్తాయి.