హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): పీజీ కోర్సుల అనుమతిని రద్దు చేయడంపై మహేశ్వర మెడికల్ కాలేజీ దాఖలు చేసిన రెండో అప్పీలును కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఆ అప్పీలును ఏకపక్షంగా తిరసరించడం చెల్లదని, కేంద్ర నిర్ణయం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉన్నదని జస్టిస్ సూరేపల్లి నంద స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంలో కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆ అప్పీలును పునఃపరిశీలించాలని, మహేశ్వర మెడికల్ కాలేజీ వాదనలను పరిగణనలోకి తీసుకుని చట్టప్రకారం నిర్ణయాన్ని వెల్లడించాలని కేంద్రాన్ని ఆదేశించారు.