హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా పూర్వపు కలెక్టర్ సీ నారాయణరెడ్డి (ప్రస్తుతం రంగారెడ్డి కలెక్టర్)పై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నల్లగొండ డీఆర్డీఏ సిబ్బందికి కనీస వేతన సేల్ అమలు చేయాలంటూ నిరుడు జారీచేసిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని ఆయనను ప్రశ్నించింది. ఆ ఆదేశాల్లో సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా ప్రస్తావించామని, అయినప్పటికీ పిటిషనర్ల వినతిపత్రాలను ఏకపక్షంగా ఎలా తిరసరిస్తారని నిలదీసింది. ఆ ఆదేశాలను 4 వారాల్లోగా అమలు చేయకుంటే కోర్టుధికార చర్యలు తప్పవని హెచ్చరించింది.
విరాల్లోకి వెళ్తే.. తమకు వేతన పేసేల్తోపాటు ఇంక్రిమెంట్ అమలు చేయాలని కోరుతూ నల్లగొండ జిల్లా డీఆర్డీఏ ఆఫీస్ సబార్డినేట్ కలమ్మ మరో ఇద్దరు దాఖలు చేసిన రిట్ పిటిషన్పై నిరుడు హైకోర్టు విచారణ జరిపింది. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పిటిషనర్లకు తగిన ఉపశమనం కల్పించాలని నిరుడు ఏప్రిల్ 2న తీర్పు చెప్పింది. కానీ, పిటిషనర్లు తాతాలిక ఉద్యోగులని, వారు పేసేల్, ఇంక్రిమెంట్కు అర్హులు కారని కలెక్టర్ నిరుడు ఆగస్టులో జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిపై పిటిషనర్లు కోర్టు ధికరణ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. విచారణ జరిపిన జస్టిస్ మాధవి దే వి.. కలెక్టర్ చర్యను తప్పుపట్టారు. 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు.